
PM Modi: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ రోజు న్యూఢిల్లీలో బీజేపీ శ్రేణులకు ప్రధాని నరేంద్రమోడీ దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీయేకు 400పైగా సీట్లు రావాలంటే, బీజేపీ 370 సీట్లు గెలవాల్సి ఉందని ఆయన అన్నారు. తాను మూడోసారి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, దేశం కోసం పనిచేయాలని ప్రధాని మోడీ అన్నారు. నా ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్లాది మంది ప్రజలకు ఇళ్లు కట్టించే అవకాశం ఉండేది కాదని అన్నారు.
Read Also: Chiranjeevi Wife: పుట్టిన రోజున ఫుడ్ బిజినెస్‌లోకి చిరంజీవి సతీమణి సురేఖ.. కొణిదెల వారి రుచులు పొందాలంటే?
10 ఏళ్లుగా ఎలాంటి అవినీతి మరక లేకుండా పాలించామని, 25 కోట్ల ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేలా చేయడం మామూలు పనికాదని అన్నారు. తాను దేశం కోసం పనిచేస్తున్నానని, రాజకీయం కోసం కాదని ప్రధాని వెల్లడించారు. రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ 100 రోజుల్లో అందరి విశ్వాసాన్ని చూరగొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేతలు, కార్యకర్తల్ని కోరారు. రాబోయే 100 రోజుల్లో మనందరం ప్రతీ కొత్త ఓటర్ని, ప్రతీ లబ్ధదారుడిని, ప్రతి సంఘాన్ని చేరుకోవాలని, అందరి విశ్వాసాన్ని గెలుచుకోవాలని చెప్పారు.