Leading News Portal in Telugu

Priyanka Gandhi: ఆస్పత్రి నుంచి ప్రియాంక డిశ్చార్జ్



Priya

కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16న అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు ‘ఎక్స్‌’ ట్విట్టర్ ద్వారా ఆమె తెలియజేశారు.

ఈనెల 16న రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుంది. కానీ ఆ యాత్రలో ప్రియాంక పాల్గొనలేదు. అనారోగ్యం కారణంగా సోదరుడి యాత్రలో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. రాహుల్‌ను యాత్రను కార్యకర్తలు విజయవంతం చేయాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. చికిత్స అనంతరం సోమవారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రియాంక డీహైడ్రేషన్‌తో పాటు కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం సోమవారం ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రాహుల్ యాత్రలో ప్రియాంక పాల్గొనకపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. రాహుల్ చేపట్టిన మొదటి విడత యాత్రలోనూ.. రెండో విడత యాత్రలోనూ ప్రియాంక పాల్గొనలేదని కమలనాథులు చెప్పుకొచ్చారు.

 

మరోవైపు రాహుల్ యాత్ర ఈనెల 21 వరకు యూపీలో కొనసాగనుంది. అంటే ఇంకా రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రెండ్రోజుల్లోనైనా ప్రియాంక పాల్గొంటారేమో వేచి చూడాలి.