Leading News Portal in Telugu

Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో.. రైతులు పంటని కాపాడుకోవడానికి రైతుల తిప్పలు..



Garlic

Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలు పెరిగాయి. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అనేక ఏర్పాట్లను చేసుకుంటునున్నారు. గతంలో టమాటో ధరలు పెరిగిన సందర్భంలో దొంగలు పంటల్ని దోపిడి చేసిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వెల్లుల్లి రైతులు పంట దోపిడి కాకుండా వినూత్న చర్యలు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా మధ్యప్రదేశ్ చింద్వారాలో వెల్లుల్లి రైతులు తమ పంటలకు రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర కిలోకి రూ. 400 నుంచి రూ. 500కి చేరుకోవడంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరోవైపు దొంగల భయం వెన్నాడుతోంది.

Read Also: Israeli flight: థాయ్‌లాండ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ఫ్లైట్ హైజాక్‌కి యత్నం..

13 ఎకరాల్లో వెల్లుల్లిని పండించడంలో రూ. 25 పెట్టుబడి పెట్టి వెల్లుల్లి సాగుదారు రాహుల్ దేశ్‌ముఖ్ ప్రస్తుతం ఆ పంటను అమ్మేసి దాదాపుగా రూ. 1 కోటి రాబడిని అందుకున్నాడు. సోలార్‌తో నడిచే కెమెరాలను పంటకు రక్షణగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు అదే ప్రాంతమైన బద్నూర్‌లో పవన్ చౌదరి అనే ఓ రైతుల 4 ఎకరాల్లో వెల్లుల్లి పంటను సాగు చేసి రూ. 6 లక్షల లాభం పొందినట్లు వెల్లడించారు. అయితే, పంటను రక్షించుకునేందు పొలంలో మొత్తం 3 సీసీటీవీలను ఏర్పాటు చేశానని, పంటను దొంగిలిస్తుండటంతో ఈ పని చేయాల్సి వచ్చిందన్నారు.

సాధారణంగా కిలో వెల్లుల్లి ధర సాధారణంగా రూ. 80 వరకు ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో వెల్లుల్లి ధర ఏకంగా రూ.500 వరకు చేరుకుంది. దీంతో రైతులు తమ పంటకు ధర పెరిగిందని ఆనందిస్తున్నారు. మరోవైపు సామాన్యుడు వెల్లుల్లి కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ధర పెరుగుదలను చూడలేదని రైతులు చెబుతున్నారు.