
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కాగా.. తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా.. 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Read Also: Congress vs SP: కాంగ్రెస్-ఎస్పీ మధ్య చర్చలు విఫలం.. మూడు సీట్ల విషయంలోనే..!
అంతేకాకుండా.. నల్గొండ టౌన్ కి బైపాస్ రోడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. CIRF ఫండ్స్ పెంపుదల.. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులు.. హైదరాబాద్ – కల్వకుర్తి, హైదరాబాద్ -విజయవాడ లైనింగ్ పనులు..
నల్గొండలో రవాణా శిక్షణ కేంద్రం ఏర్పాటు అంశాలపై నితిన్ గడ్కరితో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు.
Read Also: Supreme Court: చండీగఢ్ రిటర్నింగ్ అధికారికి సుప్రీం షాక్.. తాజా ఆదేశాలివే!
కాగా.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ, మంత్రివిస్తరణ తదితర అంశాలపై హైకమాండ్ తో చర్చించేందుకు వెళ్లారు. అందులో భాగంగానే పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు.