Leading News Portal in Telugu

Virat Kohli: వారసుడొచ్చాడు.. కోహ్లీ ఇంట్లో సంబరాలు



Kohli

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ రెండో బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ప్రకటించారు. మా చిట్టితల్లి వామికకు తమ్ముడు పుట్టాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. తన కుమారుడికి ‘అయాయ్’ అని నామకరణం చేశారని తెలిపారు. ఈ శుభసమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు.

IPL 2024: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్

ఇంతకుముందు కోహ్లీ, అనుష్క దంపతులకు మొదటి సంతానంలో కూతురు వామిక జన్మనిచ్చింది. కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల వివాహం 2017లో జరిగింది. 2021లో అనుష్క శర్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది.

Revanth Reddy: ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగానికి ప‌చ్చజెండా..

2023 నవంబర్ నుంచి అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ వార్తలపై సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వరల్డ్ కప్ సమయంలో స్టేడియానికి వచ్చిన అనుష్క శర్మ.. బేబీ బంప్ కనపడింది. ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో కనిపించినప్పటికీ ఆ దంపతులు ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించలేదు. కొన్ని రోజుల వరకు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ ఆటగాడ ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడని చెప్పాడు. మరోవైపు.. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు విరాట్ కోహ్లి గైర్హాజరు కావడం కూడా పుకార్లకు దారి తీసింది. కానీ.. ఈ విషయం బయటపెట్టడంతో అసలు నిజమేందనేది తెలిసిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)