
గత కొద్ది రోజులుగా సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఘటనతో పశ్చిమబెంగాల్ (West Bengal) అట్టుడుకుతోంది. దీంతో సందేశ్‌ఖాలీ ఘటనకు కారకులపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) చర్యలు తీసుకోకపోవడంపై ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది.
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) గ్రామంలో భూ ఆక్రమణలు, మహిళలపై లైంగిక దాడుల నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) వ్యవహరంపై కలకత్తా హైకోర్టు సీరియస్ అయింది. ప్రధాన నిందితుడిని ఇంతవరకూ అరెస్టు చేయకపోవడంపై మమతా బెనర్జీ సర్కార్‌ను ఆక్షేపించింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం షేక్ హాజహాన్ ఆచూకీని ఎందకు తెలుసుకోలేకపోయిందని ప్రశ్నించింది.
ఒక వ్యక్తి ప్రజలను కొల్లగొట్టుకుపోతుంటే అధికార పక్షం ఆ వ్యక్తిని ప్రోత్సహించకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈడీ అధికారులపై దాడితో సహా పలు కేసులు నిందితుడిపై నమోదైనప్పటికీ టీఎంసీ నేతను పట్టుకోలేకపోతున్నారని విచారణ సందర్భంగా కోర్టు ఆక్షేపించింది. షాజహాన్ పరారీలోనే ఉంటే ఆయన మద్దతుదారుల కారణంగా శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తుతూనే ఉంటాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశాలిచ్చింది. అతను హాజరయ్యే రోజే ఈడీ, సీబీఐను కూడా కోర్టుకు హాజరు కావాలని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
టీఎంసీ కీలక నేత షాజహాన్ షేక్ అనుచరులు తమ భూములను బలవంతంగా కబ్జా చేశారని, దీనిని ప్రశ్నించిన తమపై లైంగిక దాడులు చేశారని ఆరోపిస్తూ సందేశ్‌ఖాలి మహిళలు కొద్దిరోజులుగా ఆందోళనలు సాగిస్తు్న్నారు. వీరికి బీజేపీ మద్దతు తెలపడతంతో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్ర దుమారం రేగింది.
#WATCH | West Bengal LoP Suvendu Adhikari and BJP MLA Shankar Ghosh proceed to Sandeshkhali in a boat as Calcutta High Court allows them to visit the area.
High Court says they can go to Sandeshkhali but they cannot take any party worker or supporter with them due to Section 144… pic.twitter.com/fOrFNafU42
— ANI (@ANI) February 20, 2024