
చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ‘ఇండియా’ కూటమికి పెద్ద విజయం అని అభివర్ణించారు. ఇండియా కూటమికి ఇది తొలి విజయమని, దీనికి అర్థం ఎంతో ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి సుప్రీం నిర్ణయంపై కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
Ongole Crime: ఒంగోలులో కలకలం.. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిపై కత్తితో దాడి..
చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఇంత చిన్న ఎన్నికలోనే బీజేపీ దోపిడికి పాల్పడిందని తెలిపారు. అయినా.. మేము అధైర్యపడలేదని, చివరి క్షణం వరకు పోరాడి లాక్కున్నామని చెప్పారు. ఇది యావత్ దేశానికి, ఇండియా కూటమికి పెద్ద విజయం అని అన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 36 ఓట్లు వచ్చాయని, చండీగఢ్ మేయర్ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ వాళ్లు 8 ఓట్లను కొల్లగొట్టారని కేజ్రీవాల్ ఆరోపించారు.
Nuzvid: నూజివీడులో ఆసక్తికర పరిణామాలు.. ఇంఛార్జ్‌ని ప్రకటించిన టీడీపీ
మరికొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయని, అందులో 90 కోట్ల ఓట్లు ఉన్నాయని.. అందులో బీజేపీ ఎన్ని దొంగలిస్తుందో ఒక్కసారి ఆలోచించండని అన్నారు. ఇప్పటి వరకు బీజేపీ వాళ్లు గొడవలు పెడతారని, అల్లరి చేస్తారని విన్నాం కానీ, ఇలా దొంగలిస్తారని తెలియదని విమర్శించారు. బీజేపీని ఓడించలేమని చెప్పే వారికి.. ఐక్యత, కృషితో ఓడించగలమని చెప్పడానికి ఇదే పెద్ద సంకేతం అని కేజ్రీవాల్ అన్నారు. కాగా.. చండీగఢ్ మేయర్ ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం అపూర్వమైన తీర్పును వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను మేయర్‌గా ప్రకటిస్తూ.. అలాగే రద్దయిన ఆ 8 ఓట్లను కరెక్ట్ గా సుప్రీంకోర్టు ఆమోదించింది.