Leading News Portal in Telugu

Elon Musk: భారత్ లో కొన్ని ట్విట్టర్ అకౌంట్లు నిలిపివేయండి..



Musk

Social media platform X: సోష‌ల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్)కు చెందిన కొన్ని అకౌంట్లను నిలిపివేయాల‌ని కోరుతూ భార‌త సర్కార్ ఆదేశాలు జారీ చేసిందని ఆ సంస్థ పేర్కొనింది. ప్రత్యేకమైన అకౌంట్ల నుంచి జరిగే పోస్టులను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎలాన్ మాస్క వెల్లడించారు. కాగా, ఎల‌న్ మ‌స్క్ సంస్థ చేసిన ఆరోప‌ణ‌ల‌పై మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. కాగా, ఎక్స్‌కు చెందిన గ్లోబ‌ల్ గవర్నమెంట్ అఫైర్స్ అకౌంట్‌లో ఈ పోస్టు చేయగా.. భారత ప్రభుత్వ ఆదేశాల‌ను మాస్క్ కంపెనీ త‌ప్పు ప‌ట్టింది. ఈ చర్యలతో ఏకీభవించ‌డం లేద‌ని ఎక్స్ చెప్పుకొచ్చింది. భావ స్వేచ్ఛ పేరుతో పోస్టుల‌ను విత్‌హెల్డ్‌లో పెట్టడం మంచింది కాదని తెలిపింది. అయినా కానీ భార‌త ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా నడుచుకోక తప్పడం లేదని ట్వీట్ చేసింది.

Read Also: Hyderabad: నిద్రిస్తున్న వ్యక్తి.. ఇల్లు కూల్చివేసిన అధికారులు.. ఆ తర్వాత ?

అయితే, మోడీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేవలం భారతదేశంలో మాత్రమే కొన్ని అకౌంట్లు, పోస్టులను హోల్డ్ లో పెట్టనున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా.. ఆయా పోస్టులకు భావప్రకటన స్వేచ్ఛ వర్తిస్తుందని ఎక్స్ కంపెనీ వెల్లడించింది. ఇక, ప్రభుత్వ ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్ పెండింగ్ లోనే ఉందని ఎక్స్ ( ట్విట్టక్ ) పేర్కొనింది. న్యాయ‌ప‌ర‌మైన అవ‌రోధాలతో ఎగ్జిక్యూటివ్ ఆదేశాల‌ను ప‌బ్లిష్ చేయ‌డం లేద‌ని చెప్పుకొచ్చింది. కానీ, పాలనలో పారదర్శకత ఉండాలంటే ఆ అంశాలను పబ్లిక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు.