Leading News Portal in Telugu

Delhi: కాంగ్రెస్‌తో ఆప్ డీల్ కుదిరింది.. హస్తానికి ఎన్ని సీట్లంటే..!



Cm

ఢిల్లీలో (Delhi) కాంగ్రెస్-ఆప్ (Congress-AAP) మధ్య గత కొద్దిరోజులుగా నడుస్తున్న పొత్తుల పంచాయితీ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. పంజాబ్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ఇప్పటికే ఆప్ ప్రకటించింది.. కానీ ఢిల్లీలో మాత్రం పొత్తు ఫార్ములా పాటించింది.

కాంగ్రెస్-ఆప్ మధ్య జరిగిన చర్చలు ఫైనల్ స్టేజ్‌కి వచ్చాయి. ఇక అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4-3 ఫార్ములాకు ఫిక్స్ అయింది. అంటే ఆప్-4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 4 సీట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ చివరకు ఈ ఫార్ములా ఖరారైందని తెలిసింది. ఇక పంజాబ్, చండీగఢ్‌లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ తెగేసి చెప్పింది.

 

ఢిల్లీలో ఆప్ పోటీ చేసే స్థానాలివే..

1. న్యూ ఢిల్లీ
2. వాయువ్య ఢిల్లీ
3. పశ్చిమ ఢిల్లీ
4. దక్షిణ ఢిల్లీ

 

కాంగ్రెస్‌ పోటీ చేసే మూడు స్థానాలివే..

1. తూర్పు ఢిల్లీ
2. ఈశాన్య ఢిల్లీ
3. చాందినీ చౌక్

దేశ రాజధానిలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని ఆప్-కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసమే 4-3 ఫార్ములా ప్రకారం కమలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మార్చి సెకండ్ వీక్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.