Leading News Portal in Telugu

Congress- AAP: కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన ఒప్పందం.. ఐదు రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్ పై ప్రకటన..



Aap Congress

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈరోజు భారత కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల షేరింగ్ పై పొత్తు కుదిరినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆప్- కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఐదు రాష్ట్రాల పొత్తును ప్రకటించే అవకాశం ఉంది. హర్యానా, ఢిల్లీ, చండీగఢ్, గోవాతో పాటు గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్- ఆప్ కలిసి పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.

Read Also: Game Changer: ‘గేమ్ చేంజర్ ‘ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

అయితే, హర్యానాలో కాంగ్రెస్- ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో పొత్తును అధికారికంగా ప్రకటించడం ముఖ్యమైన విషయం అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. దాన్ని ఖరారు చేసేందుకు సమయం పట్టింది. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)- కాంగ్రెస్ పొత్తును అధికారికంగా ప్రకటించారు.

Read Also: IPL 2024: సీఎస్కే జట్టుకు వరుస షాక్‌లు.. మరో స్టార్‌ ఆటగాడికి గాయం..?

ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో నాలుగింటిలో ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అవి, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ, తూర్పు ఢిల్లీ స్థానాలు ఆప్ తీసుకుంటుంది. మిగతా మూడు స్థానాల్లో చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ వంటి మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు రెడీ అయింది. ఇక, ఈ పొత్తులకు సంబంధించి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ- ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి సీట్ల షేరింగ్ పై వెల్లడించనున్నారు.