Leading News Portal in Telugu

PM Modi: అరేబియా సముద్రం నీటి అడుగున పూజలు నిర్వహించిన పీఎం మోడీ.. ఫోటోలు వైరల్..



Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. శ్రీకృష్ణుడు నడయాడిన నేలగా ప్రసిద్ధి చెందిన ద్వారక ప్రస్తుతం అరేబియా సముద్రంలో మునిగిందని భావిస్తుంటారు. పీఎం మోడీ అరేబియా సముద్ర నీటి అడుగున ద్వారకాధీశుడికి పూజలు నిర్వహించారు. శతాబ్ధాల క్రితం శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా సముద్ర అడుగు భాగంలో ఉందని హిందువులలు నమ్ముతారు. బెట్ ద్వారకా ద్వీపం సమీపంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న పురాతన ద్వారక నగరం అవశేషాలను చూడవచ్చు. హిందూ గ్రంథాల్లో ఈ పురాతన ద్వారక నగరం గురించి ప్రస్తావించారు. శ్రీకృష్ణుడు ద్వారక నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ నగరం సముద్రంలో కలిసిపోయినట్లు పురాణాల్లో పేర్కొన్నారు.

Read Also: Garlic : భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. పంటకు సీసీటీవీ, తుపాకీలతో కాపలా

ప్రస్తుతం ప్రధాని నిర్వహించిన పూజలకు సంబంధించి ఫోటోలు వైరల్ అయ్యాయి. ‘‘నీటిలో మునిగిపోయిన ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. నేను ఆధ్యాత్మిక వైభవం మరియు కాలాతీత భక్తితో ముడిపడి ఉన్నానని భావించాను. భగవాన్ శ్రీ కృష్ణుడు మా అందరినీ ఆశీర్వదించాలి’’ అని ప్రధాని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘నేను సముద్రం లోతుకి వెళ్లినప్పుడు, దైవత్వాన్ని అనుభవించానని, ద్వారకాధీశుడి ముందు నమస్కరించి, నెమలి ఈకలను శ్రీకృష్ణుడి పాదాల ముందు ఉంచానని, పురాతన ద్వారకా నగర అవశేషాలను చూడటంతో నా దశాబ్ధాల కల నెరవేరింది’’ అని ఆయన అన్నారు.

ఆదివారం ఉదయం గుజరాత్ లోని దేవభూమి ద్వారక జిల్లాలో బెట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగాన్ని కలిపేందుకు అరేబియా సముద్రంపై 2.32 కి.మీ.ల పొడవైన, దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ని ప్రధాని ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి రూ. 979 కోట్ల వ్యయం అయ్యింది.