
TRAIN: లోకో పైలట్లు లేకుండానే ఓ గూడ్సు రైలు దాదాపు 70 కిలో మీటర్లు మేర పరుగులు తీసింది. ఆదివారం నాడు ఉదయం 7.25- 9.00 గంటల మధ్య జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్లు లేకుండా రైలు 70 కిలో మీటర్లు ప్రయాణించినా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకపోవడంతో అధికారులు అందరు ఊపిరి పీల్చుకున్నారు. 53 వేగన్లతో చిప్ స్టోన్స్‌ను మోసుకుని జమ్ము నుంచి పంజాబ్ వైపు రైలు వెళ్లింది. డ్రైవర్ చేంజ్ కోసం జమ్ములోని కథువా రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు.
Read Also: IND vs ENG: హే తమ్ముడు.. హీరో అవ్వాలనుకుంటున్నావా! సర్ఫరాజ్‌పై రోహిత్ ఫైర్
అయితే, ఆ ప్రదేశం కొంత వాలుగా ఉండడంతో తర్వాత కాసేపటికే ట్రైన్ నెమ్మదిగా కదులుతూ ముందుకు దూసుకుపోయింది. ఆ సమయంలో రైలులో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరూ లేరని అధికారులు చెప్పుకొచ్చారు. నెమ్మదిగా కదిలిన రైలు ఆ తర్వాత గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సుమారు ఐదు స్టేషన్లను దాటి చివరకు పంజాబ్‌లోని ఉంచి బస్సీ రైల్వే స్టేషన్ లో పట్టాలపై ఇసుక బస్తాలను, చెక్క దిమ్మెలు అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఇక, ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అని రైల్వే అధికారులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్టు జమ్ము డివిజినల్ ట్రాఫిక్ మేనేజర్ ప్రతీక్ శ్రీవాస్తవ వెల్లడించారు.