Maldives-India: మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ తోసిపుచ్చారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని వెల్లడించారు. ఎన్నికల టైంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకే ముయిజ్జూ ఇలాంటి అబద్ధాలు చెప్తున్నాడని ఆయన పేర్కొన్నారు. 100 రోజుల పాలనలో అనేక అసత్యాలు ప్రచారం చేశారు.. అందులో ఇదొకటని ఆయన తెలిపారు.
Read Also: Operation Valentine: నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
కాగా, గతంలో అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ వల్లే అనేక మంది భారత సైనికులు మాల్దీవుల్లోకి ప్రవేశించారని ఎలక్షన్ టైంలో మహ్మద్ ముయిజ్జూ ప్రచారం చేశారని అబ్దుల్లా షాహిద్ ఆరోపించారు. ఇదే నినాదంతో ఆయన ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందేందుకు ప్రయత్నం చేశారని ఎండీపీ పార్టీ తెలిపింది. కానీ, భారత్ తో అలాంటి ఒప్పందాలు కుదిరినట్లు అధికారంలోకి వచ్చాక ముయిజ్జూ నిరూపించలేకపోతున్నారని అబ్దుల్లా షాహిద్ చెప్పారు. ప్రజల విశ్వాసం కోల్పోతామనే భయంతోనే ఆయన పదే పదే అనేక అబద్ధాలు చెప్తున్నారని వెల్లడించారు.
Read Also: Medaram Jathara: నేడు మేడారం నుంచి 512 హుండీలు తరలింపు.. 29 నుంచి లెక్కింపు..
ఇక, చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహమ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్- మాల్దీవుల మధ్య గ్యాప్ పెరిగింది. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10 లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి భారత్ కు తిరిగి వెళ్లిపోవాలని ముయిజ్జూ పేర్కొన్నారు. భారత్‌కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం విధులు నిర్వహిస్తుంది. భారతదేశ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను ఈ సైన్యం చూస్తోంది.