Leading News Portal in Telugu

Bengaluru: చిన్న వయసులో జడ్జిగా ఎంపిక.. పాత రికార్డ్ చెరిపేసింది



Judge

కొందరికి అదృష్టం భలే కలిసొస్తుంది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతుంటారు. ఇంకొందరు ఎంత చదివినా త్వరగా జాబ్ సంపాదించలేరు. నెల తరబడి కోచింగ్‌లు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కానీ కొందరికి మాత్రం భలే ఛాన్స్ దొరుకుతుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి ఏకంగా ఐదు ఉద్యోగాలు సంపాదించి వార్తల్లో నిలిచారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మాయితే ఏకంగా చిన్న వయసులోనే ఏకంగా న్యాయమూర్తిగా ఎంపికై చరిత్ర సృష్టించింది.

బెంగళూరుకు చెందిన నమ్రత ఎస్ హోస్మత్(24) (Namrata s Hosmath) తొలి ప్రయత్నంలోనే సివిల్ జడ్జిగా (Youngest Civil Judge) ఎంపికైంది. అది కూడా కర్ణాటకలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఆమె.. సివిల్ జడ్జిగా ఎంపికై సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో అనిల్ జాన్ సిక్వేరా (25) అనే యువకుడి రికార్డ్‌ను ఆమె అధిగమించింది.

సివిల్స్ జడ్జి పరీక్షలు రాసిన 33 మంది బృందంలో హోస్మత్ కర్ణాటక సివిల్ జడ్జి పరీక్షలో ఆమె మొదటి ప్రయత్నంలో విజయం సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఎంపికై ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ఆమె గౌరవనీయ న్యాయమూర్తి డాక్టర్ హెచ్‌బి ప్రభాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో కర్ణాటక హైకోర్టులో లా క్లర్క్ మరియు రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.