Leading News Portal in Telugu

Metro: అన్నదాతకు అవమానం.. మెట్రో రైలు ఎక్కనివ్వని సిబ్బంది.. కారణమిదే!



Fwe

ఓ అన్నదాత పట్ల మెట్రో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. దేశానికి అన్నంపెట్టే కర్షకుడి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఈ ఘటన బెంగళూరు మెట్రో రైల్లో చోటుచేసుకుంది.

రైతులంటేనే ఓ విధమైన వస్త్రధారణ కలిగి ఉంటారు. ప్రపంచంలో ఏ అన్నదాతను చూసినా ఇలానే ఉంటారు. అలాంటిది ఓ అన్నదాతకు సరైన బట్టలు లేవు అన్న కారణం చేత మెట్రో సిబ్బంది రైలు ఎక్కనివ్వలేదు. దుస్తులు మురికిపట్టి ఉన్నాయనే కారణంతోనే ఓ రైతును మెట్రో సిబ్బంది ట్రైన్‌ ఎక్కకుండా అడ్డుకున్న ఘటన ఆదివారం బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రోస్టేషన్‌లో ట్రైన్‌ ఎక్కడానికి వచ్చిన ఓ రైతు దుస్తులు శుభ్రంగా లేవని అతన్ని ట్రైన్‌ ఎక్కకుండా సెక్యూరిటీ సూపర్‌వైజర్ అడ్డుకున్నారు. ఇది గమనించిన ఓ యువకుడు ఆ వ్యక్తికి మద్దతుగా అధికారులను ప్రశ్నించాడు. దుమ్ము పట్టిన దుస్తులు వేసుకున్న వృద్ధుడిని ప్రయాణానికి అనుమతిస్తే, ఇతర ప్రయాణికులు అభ్యంతరం చెబుతారనే అనుమతించలేదని సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ తెలిపారు. బెంగళూరు మెట్రో కేవలం వీఐపీల కోసమా లేక ప్రజల కోసమా అని ఓ యువకుడు సూపర్‌వైజర్‌ని ప్రశ్నించారు. దుస్తుల ఆధారంగా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వమని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆ యువకుడు సూపర్‌వైజర్‌ను కోరగా..అతడు సమాధానమివ్వలేదు. అనంతరం వృద్ధ రైతును మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతించారు. ఈ విషయంపై స్పందించిన బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌  సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసింది.

Fae

Fae

ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవడంతో నెటిజన్లు ఆ యువకుడిని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా నెటిజన్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పేదల ఓటగ్లు కావాలని కానీ.. పేదలను రైలు ఎక్కనివ్వరా? అని ప్రశ్నిస్తున్నారు.