Leading News Portal in Telugu

Mukesh Ambani: చిన్న కోడలికి ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే!



Radhika Gifts

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, భారత్ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటికే నిశ్చితార్థం కార్యక్రమం ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. తాజాగా ప్రీవెడ్డింగ్ ప్రోగ్రామ్‌కు సిద్ధపడుతున్నారు. మార్చి 1 నుంచి 3వరకు గుజరాత్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరులంతా ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా భారత్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే కాబోయే తన చిన్న కోడలు రాధికా మర్చంట్‌కు ముకేష్ దంపతులు అత్యంత ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోట్ల విలువైన కారు, వెండి, వజ్రాభరణాలు అందజేసినట్లు సమాచారం. సుమారు రూ.4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్‌లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరవుతున్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్‌తో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్ రానున్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు, కంపెనీల సీఈవోలు హాజరవుతున్నారు. మార్చి 1-3 వరకు ప్రీవెడ్డింగ్ కార్యక్రమం కన్నుల పండుగగా జరగనుంది.