Leading News Portal in Telugu

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్టార్ హీరో!



Akshay Kumar Modi

Is Akshay Kumar Contest From Chandni Chowk: రానున్న లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దృషి పెట్టిన పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలో గతంలో గెలిచిన మొత్తం 7 లోక్‌సభ స్థానాలను తిరిగి ఈసారి కూడా దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. పార్లమెంటులోని సిట్టింగ్ సభ్యులలో కొందరికి అవకాశం రాకపోవచ్చని, వారి స్థానాల్లో కొత్త వారిని నిలబెట్టాలని బీజేపీ చూస్తోందని సమాచారం.

ఒక నివేదిక ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ను బరిలోకి దించాలని బీజేపీ చూస్తోంది. ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ.. ఢిల్లీలోని చాందినీ చౌక్ స్థానం నుంచి అక్షయ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలు అక్షయ్‌ను ఒకసారి సంప్రదించారని ఓ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సినిమాల్లోకి రాకముందు చాలా సంవత్సరాలు చాంద్‌నీ చౌక్‌ ప్రాంతంలో అక్షయ్‌ నివసించారు. స్థానికతను దృష్టిలో ఉంచుకుని అక్షయ్‌ను బరిలోకి దింపాలని చూస్తోందట.

Also Read: Rohit Sharma: ఐపీఎల్ 2024 ట్రేడ్ విండో క్లోజ్.. ముంబైకే ఆడనున్న రోహిత్ శర్మ!

2014, 2019 ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలను బీజేపీ స్వీప్‌ చేసింది. బీజేపీ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 2014, 2019లో చాందినీ చౌక్ స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు 2004, 2009లో మాజీ కాంగ్రెస్ నాయకుడు మరియు కేంద్ర మంత్రి కపిల్ సిబల్ గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తులు కుదిరాయి. ఢిల్లీలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో ఆప్‌ బరిలో దిగాలని నిర్ణయించుకున్నాయి. దాంతో అభ్యర్థి ఎంపికలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది.