Leading News Portal in Telugu

Chinese flag on Isro ad: డీఎంకే ఇస్రో ప్రకటనలో “చైనా జెండా”.. బీజేపీ తీవ్ర విమర్శలు..



Dmk Ad

Chinese flag on Isro ad: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఇస్రో ప్రకటన వివాదాస్పదంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖర పట్నంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఇస్రో స్పేస్‌పోర్టు గురించి డీఎంకే మంత్రి చేసిన ప్రకటనలో చైనా జెండా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాకెట్ పై భాగంలో చైనా జెండా కలిగి ఉండటంతో డీఎంకే అభాసుపాలవుతోంది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ విడుదల చేసిన ప్రకటనలో.. ఇస్రో కులశేఖరపట్టణంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడాన్ని ఉద్దేశిస్తూ, ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, సీఎం స్టాలిన్, అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఫోటోలో ఓ ప్రకటన ఇచ్చాడు.

Read Also: Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో ఎస్పీ చీఫ్ అఖిలేష్‌కి సీబీఐ సమన్లు..!

అయితే, అనుకోకుండా రాకెట్ పై భాగంలో చైనా జెండాను ఉంచారు. దీంతో బీజేపీ, అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రాజెక్టులపై డీఎంకే తన ముద్ర వేస్తోందని, వాటికి క్రెడిట్ దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. డీఎంకే ఏ పని చేయని పార్టీ అని, కానీ క్రెడిట్ తీసుకునేందుకు మాత్రం ముందుంటుందని అన్నారు. మన పథకాలపై వారి స్టిక్కర్లు అంటించుకుంటున్నారని, ఇప్పుడు చైనా స్టిక్కర్లును కూడా అంటిస్తున్నారంటూ తిరునల్వేలిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ఎద్దేవా చేశారు.

భారతదేశా అంతరిక్ష పురోగతిని చూడటానికి వారు సిద్ధంగా లేరు, ప్రజలు చెల్లించే పన్నులతో ప్రకటనలు ఇస్తూ, అందులో భారత అంతరిక్ష చిత్రాలను కూడా చేర్చరని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. డీఎంకే ప్రకటనను ఖండించారు, డీఎంకే దేశ సార్వభౌమాధికారాన్ని విస్మరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేవారు. చైనా పట్ల డీఎంకే నిబద్ధతకు ఇది నిదర్శనమని, ఇస్రో రెండో లాంచ్ ప్యాడ్ ప్రకటించినప్పటి నుంచి తమ స్టిక్కర్లు అంటించేందుకు డీఎంకే తహతహలాడుతోందని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. డీఎంకే పెద్దగా మారలేదు, అధ్వాన్నంగా మారిందని అన్నామలై దుయ్యబట్టారు.