
బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే వంట గ్యాస్ సిలిండర్ల ధర అమాంతంగా పెరిగిపోతాయని హెచ్చరించారు. కచ్చితంగా రూ.2వేల వరకు పెరగొచ్చని మమత అభిప్రాయపడ్డారు.
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగానే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. వాళ్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 1,500 లేదా రూ. 2,000కి పెంచవచ్చని వ్యాఖ్యానించారు. అప్పుడు మంటలు చేసుకునేందుకు కలపను సేకరించే పాత పద్ధతికే తిరిగి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. జర్‌గ్రామ్ జిల్లాలో నిర్వహించిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే సందేశ్‌ఖాలీ ఘటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇక తాజాగా మమత చేసిన వ్యా్ఖ్యలను బీజేపీ ఎలా విధంగా స్పందిస్తుందో చూడాలి.