Leading News Portal in Telugu

PM Modi Mamata: ప్రధానితో బెంగాల్ సీఎం భేటీ.. ఏం చర్చించారంటే..!



Mdide

ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ వచ్చారు. హుగ్లీ, నదియా జిల్లాల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో పాల్గొని పలు ప్రభుత్వ పథకాలను మోడీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.

ప్రధానితో భేటీ అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. మర్యాదపూర్వకంగానే మోడీని కలిసినట్లు ఆమె తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారమే ప్రధానిని కలిసినట్లు ఆమె పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ అంశాలు రాలేదని తెలిపారు.

ఇదిలా ఉంటే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఆధార్ కార్డులు బ్లాక్ చేశారంటూ ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే ఉపాధి హామీ పథకానికి (MGNREGA) సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని మోడీని కోరినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర బకాయిల విడుదల కోసం ఒత్తిడి చేయడానికి ఢిల్లీలో ప్రధాని మోడీని మమత కలిశారు. కేంద్రం రూ.1.18 లక్షల కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం.