
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఎంసీని అవినీతి పార్టీగా ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 స్థానాలను గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి టార్గెట్ నిర్దేశించారు.
Read Also: Nitish Kumar: “ప్రధాని మోడీని ఇక విడిచి పోయేది లేదు”..ఎన్డీయేతోనే ఉంటానన్న సీఎం నితీష్ కుమార్..
కృష్ణానగర్‌లో జరిగిన ‘బిజోయ్ సంకల్ప సభలో’ ఆయన మాట్లాడుతూ.. మీరంతా ఇక్కడకు ఇంత భారీ సంఖ్యలో తరలిరావడం చూస్తుంటే ఎన్డీయే సర్కార్ 400 స్థానాలను కైవసం చేసుకుంటుందనే ఆత్మవిశ్వాసం కలుగుతోందని ప్రధాని అన్నారు. టీఎంసీ దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయాలు, ద్రోహానికి పర్యాయపదమని విమర్శించారు. బెంగాల్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసి నిరాశ చెందారన్నారు.
Read Also: Anant Ambani: కుమారుడి మాటలకు ముకేశ్ అంబానీ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి
సందేశ్‌ఖలీ మహిళలపై లైంగిక వేధింపులను గురించి ప్రస్తావిస్తూ.. ఈ ప్రాంతంలోని బాధలో ఉన్న తల్లులు, సోదరీమణులకు మద్దతు ఇవ్వాల్సిందిపోయి, రాష్ట్ర ప్రభుత్వం నిందితుల పక్షాన ఉందని పీఎం ఆరోపించారు. అక్కడి మహిళలు న్యాయం కోసం గళమెత్తినా ప్రభుత్వం వినలేదని అన్నారు.