
Jharkhand: జార్ఖండ్‌లో స్పానిష్ యువతిపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్ టూరిస్ట్ అయిన మహిళపై అతని భాగస్వామిపై దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. నిందితులను కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు. ఈ పీడకలకు సంబంధించి స్పానిష్ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ముఖం నిండా గాయాలతో భయానక అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ ఎవరూ కోరుకోనిద మాకు జరిగింది. ఏడుగురు వ్యక్తులు నన్ను రేప్ చేశారు’’ అంటూ బాధ వ్యక్తం చేశారు.
రెండు బైకులపై బంగ్లాదేశ్ నుంచి దుమ్కాకు చేరుకుని, బీహార్ గుండా నేపాల్ వెళ్తున్న మహిళ, ఆమె భాగస్వామిని దోచుకుని, అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారు మమ్మల్ని దోచుకున్నారని, వారు కోరుకున్నది తనను రేప్ చేయడమే అని ఆమె పోస్టులో వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు.
Read Also: Kerala: సీనియర్ అమ్మాయిలతో డ్యాన్స్ చేసినందుకు ర్యాగింగ్.. విద్యార్థి మృతి కేసులో 11 మంది అరెస్ట్..
దుమ్కా ఎస్పీ పితాంబర్ సింగ్ ఖేర్వార్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హాన్స్‌దిహా పోలీస్ పెట్రోలింగ్ టీం ఇద్దరు బాధితులను కనుగొన్నారని, వారికి ఏదో జరిగిందని పోలీసులు పసిగట్టారని, అయితే వారు స్పానిష్‌లో మాట్లాడటం వల్ల పోలీసులకు ఏం అర్థం కాలేదని, వారికి చికిత్స అవసరమని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు తమకు సమాచారం వచ్చిందని, వెంటనే విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఫోరెన్సిక్, సీఐడీ సహాయం తీసుకుంటున్నామని తెలిపారు.
పోలీసులపై చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ బీజేపీ చీఫ్, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ డిమాండ్ చేశారు. విదేశీయులకు ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్రానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్ణకరమని, నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.