
Shehbaz Sharif: దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానిగా రెండోసారి షహజాబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీల ఉమ్మడి సర్కారుకు షహబాజ్ నాయకత్వం వహించనున్నారు. ఈ రోజు ప్రధానిని ఎన్నుకునేందుకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశమైంది. మొత్తం 336 మంది సభ్యుల ఓట్లలో షహజాబ్ 201 ఓట్లు పొందారు. మరోవైపు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చెందిన ఒమర్ అయూబ్ ఖాన్ కేవలం 92 ఓట్లను మాత్రమే సాధించారు.
Read Also: Mylavaram Ticket: వసంత ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు.. కలిసిపోయిన దేవినేని, బొమ్మసాని!
ప్రధానిని ఎన్నుకునే సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. పీటీఐ మద్దతుదారులు నినాదాల మధ్యే షహబాజ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. షెహబాజ్ మార్చి 4న రాష్ట్రపతి భవనమైన ఐవాన్-ఎ-సదర్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నిక ముందు పాకిస్తాన్ ప్రధానిగా షెహజాబ్ ఉన్నారు. ఏప్రిల్ 2022 నుండి ఆగస్టు 2023 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా పనిచేశారు.
ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా 93 మంది గెలుపొందారు. నవాజ్ షరీఫ్ పార్టీకి 75 స్థానాలు రాగా.. భుట్టో పార్టీకి 54 సీట్లు దక్కాయి. ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ) 17 సీట్లు గెలుచుకుంది. షరీఫ్, భుట్టో పార్టీ, ఇతర ఇండిపెండెంట్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకారానికి వచ్చాయి. ఈ రెండు పార్టీల ఒప్పందం ప్రకారం.. షహబాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని అయితే, పీపీపీ నుంచి బిలావల్ భుట్టో తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉండనున్నారు. గతంలో 2008 నుంచి 2013 వరకు ఈయన ప్రెసిడెంట్‌గా పనిచేశారు.