
హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Congress) అనర్హతకు గురయిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. తమపై స్పీకర్ కుల్దీప్ సింగ్ అనర్హత వేటు వేయడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అని ఎమ్మెల్యేలు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరుగురిపై వేటు వేసింది.
ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కుల్దీప్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. దీంతో ఆరుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. తమ అనర్హతపై గత వారం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం నడుస్తోంది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడినందుకు వేటుకు గురైతే.. తాజాగా అదే బాటులో మరో 9 మంది ఎమ్మెల్యేలు వారి వెంట నడవనున్నట్లు తెలుస్తోంది.
హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 34 సీట్లు వచ్చాయి. తాజాగా మరో తొమ్మిదిమంది గోడ దూకేటట్లు కనిపిస్తోంది. ఇలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉండే ప్రమాదం ఉంది.