Leading News Portal in Telugu

Jharkhand: ఇండియాలో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి.. ఇక్కడి ప్రజలు మంచివారు



Jharkhand

జార్ఖండ్‌లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ మంచి మనసు చాటుకుంది. భారత ప్రజలపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపింది. భారతదేశ ప్రజలు చాలా మంచి వారని స్పానిష్ పర్యాటకురాలు చెప్పారు. తాను నేరస్తులను తప్ప ఇక్కడి ప్రజలను నిందించను.. ఇక్కడి ప్రజలు తనను చాలా బాగా ఆదరించారని పేర్కొంది. వారు తన పట్ల దయతో ఉండటం వల్లనే.. భారత్ లో దాదాపు 20 వేల కిలోమీటర్లు సురక్షితంగా ప్రయాణించగలిగానని చెప్పింది. ఇదిలా ఉంటే.. స్పానిష్ మహిళ గ్యాంగ్ రేప్ కేసులో మరో ఐదుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. గత ఆరు నెలలుగా భారత్ లో ఉన్నామని, దాదాపు 20 వేల కి.మీ ప్రయాణించామని స్పానిష్ మహిళ తెలిపింది. తమకు ఎక్కడా ఎలాంటి సమస్య రాలేదు.. ఇలాంటి సంఘటన మొదటిసారి అని చెప్పింది. తనకు భారతదేశంలో మంచి జ్ఞాపకాలు ఉన్నాయని.. తన భర్తతో కలిసి ప్రయాణం కొనసాగిస్తాని చెప్పుకొచ్చింది.

Telangana CM: ప్రధాన మంత్రిని పెద్దన్న అంటే తప్పేముంది

మార్చి 1వ తేదీ రాత్రి దుమ్కా జిల్లాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బాధితురాలిని, ఆమె భర్తను కొట్టి లాక్కెళ్లారు. అర్థరాత్రి, హన్స్‌దిహా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు బాధిత జంటను రోడ్డు పక్కన చూసి, వారిని స్థానిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు, వారిని మెరుగైన చికిత్స కోసం దుమ్కాలోని ఫూలోజనో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తన భర్తతో కలిసి బైక్ టూర్‌కు వెళ్లిన స్పెయిన్‌కు చెందిన మహిళ రాష్ట్ర రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలో సామూహిక అత్యాచారానికి గురైంది.

Wife Stabs Husband: “పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదని”.. నిద్రిస్తున్న భర్తను పొడిచిన భార్య..

28 ఏళ్ల మహిళ, ఆమె 64 ఏళ్ల భర్త రెండు మోటార్‌సైకిళ్లపై బంగ్లాదేశ్‌ నుంచి దుమ్కా చేరుకున్నారు. బీహార్ మీదుగా నేపాల్ వెళ్లే మార్గంలో వారు బీహార్‌లోని భాగల్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ జంట టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి ఆసియాను చుట్టి మెగా ట్రిప్‌లో ఉన్నారు. ఈ జంట మొదట పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లి, దుమ్కాకు చేరుకుంది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేసేందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని దుమ్కా ఎస్పీని ధర్మాసనం ఆదేశించింది. “ఒక విదేశీ పౌరుడిపై ఎలాంటి నేరం జరిగినా అది దేశ పర్యాటక ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు తీవ్రమైన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను కలిగిస్తుంది. విదేశీ మహిళపై లైంగిక సంబంధిత నేరం దేశానికి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారాన్ని తెచ్చి తద్వారా కళంకం కలిగిస్తుంది.” అని కోర్టు పేర్కొంది.