Leading News Portal in Telugu

NIA: రామేశ్వరం నిందితుడి ఆచూకీ చెబితే భారీ రివార్డ్.. ఎంతంటే..!



Reward

బెంగళూరులోకి (Bengaluru) రామేశ్వరం కేఫ్‌లోని (Rameshwaram Cafe) బాంబు పేలుడు ఘటనలో ఎన్‌ఐఏ సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. పేలుడు జరిగి వారం అవుతున్న నిందితుడి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వ పెద్దలను చంపేస్తామంటూ తాజాగా మెయిల్స్ వచ్చాయి. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.

ఇదిలా ఉంటే రామేశ్వరం నిందితుడి కోసం ఎన్‌ఐఏ అధికారులు జల్లెడపడుతున్నారు. మరోవైపు అతడి ఆచూకీ కోసం భారీ రివార్డ్‌ను ప్రకటించింది. నిందితుడి ఆచూకీ తెలియజేస్తే రూ.10 లక్షలు బహుమానం ఇస్తామని వెల్లడించింది. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది.