Leading News Portal in Telugu

Rajasthan Covid: ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు పోస్ట్ కోవిడ్



Covid

కోవిడ్ (Covid) వార్త మరోసారి భయాందోళన కలిగిస్తోంది. కరోనా తగ్గుమొఖం పట్టింది అనుకుంటున్న సమయంలోనే తాజాగా మరో న్యూస్ కలకలం రేపింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి (Rajasthan CM) భజన్‌లాల్ శర్మ తాజాగా కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.

ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకి ఇటీవల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని ‘ఎక్స్’ వేదికగా ఆయన వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం తాను ఐసొలేషన్‌లో ఉన్నానని, రోజువారీ కార్యక్రమాల్లో వర్చువల్‌గా పాల్గొంటున్నట్లు భజన్‌లాల్ శర్మ తెలిపారు.