Leading News Portal in Telugu

Car Parking: అక్కడ కారు పార్కింగ్ చెయ్యాలంటే వెయ్యి కట్టాల్సిందే…



Car Parking

భారత దేశంలోని మెట్రోపాలిటన్ సిటిల్లో కారును పార్కింగ్ చేయడం చాలా కష్టం.. రోడ్లకు దగ్గరలో బిల్డింగ్ లను కట్టడంతో పాటు అస్సలు ఖాళీ స్థలం అనేది లేకుండా ఆక్రమించడం వల్ల వాహనాల పార్కింగ్ పెద్ద ఇబ్బందిగా మారింది.. దాన్నే కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు.. పెయిడ్ పార్కింగ్ పేరుతో దండుకుంటున్నారు.. ముఖ్యంగా బెంగుళూరు వంటి మహానగరంలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది..

కేవలం పార్కింగ్ కోసమే అయితే నెలకు 500 రూపాయలు కట్టొచ్చు. కానీ ఇలా గంటకు రూ.1000 చెల్లించాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే. అవును బెంగళూరు సిటీలో గంటలకు వెయ్యి రూపాయల చొప్పున పార్కింగ్ కోసం ఖర్చు పెడుతున్నారు.. సోషల్ మీడియాలో ఓ పార్కింగ్ బోర్డు ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి… నగరంలోని యూబీ సిటీ మాల్ ప్రీమియం పార్కింగ్ కోసం గంటకు రూ.1,000 వసూలు చేస్తోంది.

ప్రీమియం పార్కింగ్ ఇక్కడి వాహనదారులు వెయ్యి రూపాయలు పే చేస్తున్నారు. ఒకవేళ పే చేయకపోతే అక్కడి సిబ్బంది వెంటనే అలర్ట్ అవుతారు.. కారును పెట్టనివ్వరు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.. కేవలం పార్కింగ్ కోసమేనా లేక కారు వాష్ కూడా చేస్తారా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వార్త వైరల్ అవుతుంది..