Leading News Portal in Telugu

Aircraft crash: మధ్యప్రదేశ్‌లో కూలిన శిక్షణ విమానం



Plye

మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh)‌ ఓ శిక్షణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా పైలట్ గాయపడ్డారు. ఈ ఘటన గుణలో బుధవారం చోటుచేసుకుంది.

నీముచ్ నుంచి ధనకు విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విమానం అదుపుతప్పి కుప్పకూలడంతో అందులోని మహిళా ట్రైనీ పైలట్ గాయపడినట్టు సబ్‌ ఇన్‌స్పెక్టర్ చంచల్ తివారి తెలిపారు. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. ప్రస్తుతం పైలట్ ఆస్పత్రికి చికిత్స పొందుతోంది.