Leading News Portal in Telugu

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ విడుదల.. ఎగ్జామ్ ఎప్పుడంటే..!



De

దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. సీటెట్ పరీక్షను 2024 జులై 7న నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది.

దేశ వ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు మార్చి 7 నుంచి ఏప్రిల్ 2 రాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ సీటెట్ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ వరంగల్‌లో సెంటర్లు ఉన్నాయి.