Leading News Portal in Telugu

Kranti: హీరోయిన్ క్రాంతికి బెదిరింపులు



Acr

మరాఠీ నటి, సమీర్ వాంఖడే భార్య క్రాంతి రెడ్కర్ వాంఖడే (Kranti)కు పాకిస్థాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులను ఆమె వేడుకోంది.

క్రాంతి రెడ్కర్.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముంబై జోనల్ మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే భార్య (Sameer Wankhede wife Kranti). మొబైల్ ఫోన్, వాట్సాప్ ద్వారా ఆమెకు.. ఆమె కుటుంబ సభ్యులకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె గోరేగావ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.

ఆమె ఫిర్యాదు ప్రకారం మార్చి 6న ఉదయం 10:49 గంటలకు యునైటెడ్ కింగ్‌డమ్ +441792988111 నెంబర్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను దుర్భాషలాడాడు. అంతేకాకుండా ఆమెను, ఆమె కుటుంబ సభ్యులకు చంపేస్తామని బెదిరించాడు. అదే రోజు ఉదయం 10:59కి +923365708492 నంబర్ నుంచి పాకిస్థాన్ వాట్సాప్ సందేశాలు వచ్చాయి.

తన ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నటి కోరింది. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ జోన్-11 ఆనంద్ భోత్ మాట్లాడుతూ.. తమకు ఒక దరఖాస్తు వచ్చిందని. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ కూడా ఇటీవల బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.