Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ యాత్ర ముగింపు కార్యక్రమానికి కూటమి ఇండియా కూటమి నేతలకు ఆహ్వానం..

Bharat Jodo Nyay Yatra: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమి బలాన్ని చూపేందుకు కాంగ్రెస్ మరోసారి భారీ కార్యక్రమానికి తెరతీసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ మార్చి 17న ముంబైలో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతల్ని మల్లికార్జున ఖర్గే ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల మోడ్‌లో ఉందని, దూకుడుగా ప్రచారం చేస్తామని అన్నారు.
Read Also: EC Alert: ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ క్లారిటీ
రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న న్యాయ్ యాత్ర ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో జరుగుతోంది. మార్చి 17న ముంబైలో భారీ ర్యాలీతో యాత్ర ముగుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మిత్రపక్షాలకు లేఖ రాయనున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించారు. మొత్తం 6700 కిలోమీటర్ల ఈ యాత్ర ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్, యూపీ, బీహార్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో జరగనుంది.