Leading News Portal in Telugu

Amit Shah: రాహుల్‌ని ప్రధాని చేయడమే సోనియాగాంధీ లక్ష్యం.. కాంగ్రెస్ పేదలకు చేసిందేం లేదు..



Amit Shah

Amit Shah: కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు తమ కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేశారని, పేదల కోసం ఏం చేసింది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆరోపించారు. పాట్నాలోని పాలిగంజ్ ప్రాంతంలో జరిగిన ఓబీసీ మోర్చా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పేదలకు మేలు చేసింద కేవలం ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎల్లప్పుడూ వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకున్నారని, వెనకబడిన ప్రజల పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన కుటుంబం కోసమే జీవితమంతా జీవించారని ఆరోపించారు. సోనియా గాంధీ ఏకైక లక్ష్యం తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే అని అన్నారు.

Read Also: Nabam Tuki: కాంగ్రెస్‌కి బిగ్ షాక్.. పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం..

పేదల నుంచి భూములు లాక్కున్న వారిపై ప్రభుత్వం త్వరలో కమిటీ వేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెనకబడిన వర్గాల, పేదల భూములను లాలూ ప్రసాద్ లాక్కున్నాడని, బీహార్‌లో మళ్లీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిందని ల్యాండ్ మాఫియాపై మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ ఎక్కువ కాలం అధికారంలో ఉన్నప్పటికీ సీనియర్ నేత కర్పూరీ ఠాకూర్‌కి తగిన గౌరవం ఇవ్వలేదని షా విమర్శించారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది ప్రధాని మోడీ అని చెప్పారు.