
Nabam Tuki: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తు్న్నారు. అరుణాచల్ ప్రదేవ్ మాజీ సీఎం నబమ్ తుకీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను అడ్డుకోలేని నైతిక కారణాలతో టుకీ రాజీనామా చేశారు.
Read Also: Lok Sabha Election: గురువారం లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్..?
టుకీ సాగలీ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ తుకీ లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శనివారం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు పార్టీ మార్పిడిని అడ్డుకోలేకనే ఆయన రాజీనామా చేశారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా అన్నారు. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) నాయకుడు లాంబో తాయెంగ్ బీజేపీలో చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ కూడా పార్టీ మారారు.