Leading News Portal in Telugu

PM Modi: అస్సాం టీ గార్డెన్‌ను ఆస్వాదించిన మోడీ



Ta

అస్సాంలో (Assam) ప్రధాని మోడీ (PM Modi) పర్యటిస్తున్నారు. రెండ్రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా మోడీ శుక్రవారం అస్సాం చేరుకున్నారు. ఈ ఉదయం కజిరంగా నేషనల్ పార్క్‌ సందర్శించారు. అనంతరం ఏనుగుపై స్వారీ చేశారు. కొంత సేపు జీపులో కూడా ప్రయాణం చేశారు. కాజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడ పెద్ద సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయని మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మధ్యాహ్నం అస్సాంలోని టీ గార్డెన్‌ను (Tea Estate) కూడా ప్రధాని మోడీ సందర్శించారు. అక్కడ కొంత సమయం గడిపారు. టీ ఉత్పత్తులను గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు.

 

Mdodi

అస్సాం తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోతుంటాయి. సంవత్సరానికి దాదాపు 700 మిలియన్ కిలోల తేయాకులను ఉత్పత్తి చేస్తోంది. దేశంలో సగం వాటా ఇక్కడ నుంచి ఎగుమతి జరుగుతుంటుంది. టీ గార్డెన్ సందర్భన తర్వాత.. అద్భుతమంటూ ప్రధాని మోడీ ప్రశంసించారు.

ఇదిలా ఉంటే అస్సాం పర్యటన తర్వాత మోడీ.. అరుణాచల్ ప్రదేశ్ వెళ్లనున్నారు. తవాంగ్‌లో రూ.825 కోట్లతో నిర్మించిన సెలా టన్నెల్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. సెలా టన్నెల్ తవాంగ్‌ని అస్సాంలోని తేజ్‌పూర్‌ని కలుపుతుంది.