Leading News Portal in Telugu

Mallikarjun Kharge: లోక‌స‌భ ఎన్నిక‌ల‌కు ఏఐసీసీ చీఫ్ దూరం?.. కారణం ఇదే..!



Kharge

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. క‌ర్ణాట‌క‌లోని గుల్బార్గా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయ‌న పోటీ చేస్తార‌ు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కూడా పేరు చేర్చిన‌ట్లు తెలిసింది. కానీ ఖ‌ర్గే త‌న అల్లుడు రాధాకృష్ణన్ దొద్దమణిని గుల్బార్గా నుంచి ఎన్నికల బ‌రిలోకి దించాల‌ని చూస్తున్నట్లు టాక్. అయితే, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే గుల్బార్గా నుంచి రెండు సార్లు లోక్‌స‌భ‌కు పోటీ చేయగా.. 2019 ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత రాజ్యసభకు ఆయన నామినేట్ అయ్యారు. ఇక, ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆయన పదవి కాలం మరో నాలుగు సంవత్సరాల పాటు ఉంటుంది.

Read Also: Traffic Restrictions: నేడు హైద‌రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ఇక, మల్లికార్జున ఖ‌ర్గే కుమారుడు ప్రియాంక్ ఖ‌ర్గే క‌ర్ణాట‌క కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న కూడా గుల్బార్గా నుంచి పోటీ చేసే ఛాన్స్ లేదు.. దీంతో అల్లుడిని బ‌రిలోకి దించాల‌ని ఖ‌ర్గే ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే, తాను ఒక నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం కాకూడ‌దనే.. దేశ‌మంత‌టా త‌న సేవ‌లు అవ‌స‌రం ఉన్నాయ‌ని ఖ‌ర్గే త‌న అనుచ‌రుల‌తో చెప్పిన‌ట్లు తెలుస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ఎంపీ ఎన్నికలకు దూరంగా మల్లికార్జున ఖర్గే ఉన్నట్లు సమాచారం. అయితే, గ‌తంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు సోనియా, రాహుల్ గాంధీలు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలిచారు.