
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు జమ్మూకాశ్మీర్ పార్టీలు మద్దతు తెలిపాయి. జమిలి ఎన్నికలను జమ్మూకాశ్మీర్‌తోనే ప్రారంభించాలని పార్టీలు కోరాయి. దాదాపు ఆరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం లేదని.. రాష్ట్రపతి పాలనలోనే కొనసాగుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ముందు వాపోయాయి.
నేషనల్ కాన్ఫరెన్స్ , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్, గులాం నబీ ఆజాద్ యొక్క డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీలు జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని ఈసీని కోరాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్నామని… ఆరేళ్లుగా రాష్ట్రంలో ఎన్నికలు లేవని తెలిపాయి.
త్వరలోనే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు కోరాయి. మరోవైపు సోమవారం భారత ఎన్నికల సంఘం.. పోల్ ప్యానెల్ బృందంతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణపై చర్చించారు.
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడఖ్ దాని ఆరు లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో జరగనున్నాయి. ఇక సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్ర హోదా పునరుద్ధరణలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారు.
జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నట్లు ఆజాద్ తెలిపారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలనే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌లో భాగంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆజాద్ పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటరీ స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. ఈ స్థానం సాంప్రదాయకంగా మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందినది. మరీ ఆజాద్ పోటీ చేస్తారా? లేదంటే పార్టీ తరపున ప్రచారం చేస్తారో చూడాలి.
అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడాన్ని తాను తోసిపుచ్చడం లేదని ఆజాద్ అన్నారు. చాలా మంది తనను పోటీ చేయమని అడుగుతున్నారన్నారు. తాను పార్లమెంటులో ఉండాలనే డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలను సురక్షితంగా నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటికే 600 పారామిలటరీ కంపెనీల మోహరింపు చేసింది. ఇక బీజేపీ ప్రతినిధి బృందం కూడా పోల్ ప్యానెల్ బృందాన్ని కలిసి.. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఎన్నికల కమిషన్ విచక్షణకే తేదీల ప్రకటనను బీజేపీ వదిలేసింది.