
Manohar Lal Khattar: హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తన ఎమ్మెల్యే పదవికి ఈ రోజు రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేయడం గమనార్హం ఖట్టర్ 2014 నుంచి కర్నాల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. కర్నాల్ లోక్‌సభ అభ్యర్థిగా ఖట్టర్‌ని బీజేపీ బరిలోకి దింపొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Also: Ananya Nagalla : రక్తం అమ్ముకుంటున్న అనన్య నాగళ్ల.. వైరల్ అవుతున్న వీడియో..
సీఎం పదవికి మనోహార్ లాల్ కట్టర్, ఆయన మంత్రివర్గంలోని 13 మంది మంగళవారం రాజీనామా చేశారు. దీని తర్వాత బీజేపీ రాష్ట్ర చీఫ్ నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించింది. బీజేపీ-జేజేపీ పొత్తులో విబేధాలు ఏర్పడిన తర్వాత ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దుష్యంత్ చౌతానాలో నేతృత్వంలోని జయనాయక్ జనతా పార్టీ(జేజేపీ)కి బీజేపీకి మధ్య లోక్‌సభ సీట్ల షేరింగ్ విషయంలో అవగాహన కుదరలేదు. దీంతో ఇన్నాళ్లు ప్రభుత్వంలో ఉన్న జేజేపీని కాదని బీజేపీ స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగిన బలనిరూపణ పరీక్షలో బీజేపీ గట్టెక్కింది.
2019 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీ 40 సీట్లు గెలుచుకోగా, జేజేపీ 10 స్థానాల్లో విజయం సాధించింది. ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 10 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో జేజేపీ తమకు 2 స్థానాలు ఇవ్వాలని కోరగా.. బీజేపీ 1 స్థానానికి అంగీకరించింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ముదిరాయి. దీంతో పొత్తు విచ్ఛిన్నమైంది.