Leading News Portal in Telugu

Congress: నారీమణులే లక్ష్యంగా కాంగ్రెస్ వరాలు.. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయంటే..!



Mali

సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నారీమణులపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో గ్యారంటీల పేరుతో అధికారం ఛేజిక్కించుకున్నాయి. ఎక్కువగా మహిళలను దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో స్కీమ్స్ అమల్లోకి తెచ్చారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, ఆర్థిక సాయం పేరుతో పథకాలు అమలు చేస్తున్నాయి.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్… నారీ న్యాయ్ గ్యారంటీ పేరుతో పథకాలను ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. మహిళలపై వరాల జల్లులు కురిపించారు.

మహిళా ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ వరాల వర్షం కురిపించింది. స్త్రీల సంక్షేమమే లక్ష్యంగా నారీ న్యాయ్ గ్యారంటీని ప్రకటించింది. ఈ పథకాల ద్వారా ఏటా పేద కుటుంబాలకు చెందిన మహిళలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

మహాలక్ష్మి, ఆధి ఆబది పూరా హక్, శక్తి కా సమ్మాన్, అధికార్ మైత్రి, సావిత్రీబాయి ఫూలే హాస్టల్ వంటి ఐదు గ్యారంటీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరిగే కొత్త రిక్రూట్‌మెంట్లలో సగానికిపైగా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరాలు వెల్లడించారు.

అలాగే అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ ఆదాయానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేయనున్నారు. మహిళలకు వారి హక్కులపై అవగాహనతో పాటు సాధికారత కల్పించేందుకు ప్రతి పంచాయతీలో ఒక పారాలీగల్ ప్రొఫెషనల్‌ను నియమించనుంది. శ్రామిక మహిళలకు సురక్షితమైన ఆవాసం కల్పించేందుకు జిల్లా ప్రధాన కార్యాలయంలో పనిచేసే మహిళలకు ఒక హాస్టల్‌ను నిర్మించనుంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఇప్పటివరకూ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రెండు దఫాలుగా విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులో 39, సెకండ్ లిస్టులో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక మూడో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు చేసింది.