Leading News Portal in Telugu

BJP: బీజేపీ రెండో జాబితా వచ్చేసింది.. తెలంగాణ నుంచి ఎంతమందంటే..!



Bjp

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.

 

తెలంగాణ రెండో జాబితాలో అభ్యర్థులు వీరే

ఆదిలాబాద్-గోడం నగేశ్
పెద్దపల్లి-గోమాస శ్రీనివాస్
మెదక్-రఘునందన్‌రావు
మహబూబ్‌నగర్-డీకే అరుణ
నల్గొండ-సైదిరెడ్డి
మహబూబ్‌నగర్-సీతారాం నాయక్

 

రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. 150 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి కానీ.. 72 మందితోనే సరిపెట్టేశారు. ఇక తొలి జాబితాలో 195 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఫస్ట్ లిస్టులో ప్రధాని మోడీ ఉన్నారు. ఆయన మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక ఏపీ నుంచి అభ్యర్థులను ఎవర్నీ ప్రకటించలేదు. ఇటీవలే టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు స్థానాలను కేటాయించారు. రేసులో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, జీవీఎల్.నరసింహారావు పేర్లు వినిపించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ జోలికి మాత్రం వెళ్లలేదు.

ఇక మంగళవారం కాంగ్రెస్ కూడా రెండో జాబితా విడుదల చేసింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి 43 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అభ్యర్థులను వెల్లడించింది. తొలి జాబితాలో 39 మందిని ప్రకటించగా.. సెకండ్ లిస్టులో మాత్రం 43 మందిని ప్రకటించింది. 43 మందిలో జనరల్‌ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా.. 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.