Leading News Portal in Telugu

Election Commissioner: నేడు ఎన్నికల కమిషనర్ల ఎంపిక.. ప్రధాని మోడీతో కీలక భేటీ



Ec

Poll Body Vacancies: నేడు కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్ల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అయితే, ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే రిటైర్‌ కావడంతో పాటు అరుణ్‌ గోయల్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక్క చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ మాత్రమే కొనసాగుతున్నారు. కాగా, మరి కొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉండటంతో ఈసీల నియామకం వేగంగా జరుగుతుంది.

Read Also: Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్

మరో వైపు.. కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు (శుక్రవారం) విచారించనుంది. కాగా, సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఈ రెండు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రధాన మంత్రి నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే భేటీ అవుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్‌ వేసిన పిటిషన్‌ను లిస్ట్‌ చేసినట్లు సమాచారం.

Read Also: Allu Arjun: బన్నీ నేషనల్ అవార్డ్ విన్నింగ్​ రోజు ఏకంగా ఇంటికే వెళ్లాను.. ‘ప్రేమలు’ బ్యూటీ..!

కాగా, కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండనున్నారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండేది.. కానీ, కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి ఛాన్స్ కల్పించారు. ఇక, ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.