Leading News Portal in Telugu

Murder: ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన తండ్రికొడుకులు..!



Sam

ఈమధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉండడడం మనం కొన్ని సందర్భాలలో చూస్తున్నాము. మరికొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు అంటే నమ్మండి. ఇలాంటివి చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం చనిపోతుందేమో అనిపిస్తుంది. తాజాగా ఒక హోటల్ లో ఎక్స్ ట్రా సాంబర్ ప్యాకెట్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన సంగతి కలకలం రేపింది. మంగళవారం రాత్రి చెన్నైలోని పల్లవరం సమీపంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ లో జరిగింది.

also read: Head Phones: రోజూ రాత్రివేళ హెడ్‌ఫోన్స్‌ తో పాటలు వింటున్నారా..? అయితే ఆ యువతిలా మీకు కూడా..

కేవలం అదనపు సాంబార్ ను అడిగినందుకు జరిగిన ఈ గొడవలో హోటల్ సూపర్ వైజర్ ను ఇద్దరు తండ్రీకొడుకులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. అనగపుత్తూరు లోని పరిగర్ కు చెందిన శంకర్, ఆయన కుమారుడు అరుణ్ కుమార్ ఇడ్లీ కొరకు హోటల్ కు వెళ్లారు. ఇందులో భాగంగా ఆర్డర్ రాగానే వారికి అదనంగా మరో సాంబార్ ప్యాకెట్ ఇవ్వాలని సిబ్బందిని అడిగారు. కాకపోతే అదనపు సాంబారు ప్యాకెట్ ఇవ్వలేమని సిబ్బంది తేల్చి చెప్పారు.

Also read: Tatkaal Passport: ఎమర్జెన్సీ​గా విదేశాలకు వెళ్లాలా..? అయితే ‘తత్కాల్ పాస్ ​పోర్ట్’ ఎలా​ అప్లై చేయాలంటే..?!

దాంతో అక్కడ వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆపై వారు పార్కింగ్ స్థలంలో ఉన్న తమ వాహనాన్ని తీసుకెళ్లాలని కోరడంతో ఇద్దరూ సెక్యూరిటీలపై కూడా దాడి చేయడం ప్రారంభించారు. ఇలా జరుగుతున్న సమయంలో వారిని గమనించిన సూపర్ వైజర్ అరుణ్ సంఘటనా స్థలానికి వెళ్లి వారి సెక్యూరిటీపై దాడి చేయడం ఆపాలని కోరాడు. అయితే వాటిని వినకుండా అరుణ్ కుమార్ తల, నుదుటి, మెడపై దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ పరిస్థితిని చూసి అతనిని వెంటనే జీజీహెచ్ కు తరలించగా అప్పటికే అరుణ్ మృతి చెందాడు. దింతో పూర్తి సమాచారం తెలుసుకున్న శంకర్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శంకర్, అరుణ్ కుమార్ లను అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.