Leading News Portal in Telugu

Omar Abdullah: జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఈసీ విఫలమైంది..



Omar

Jammu and Kashmir Elections 2024: జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది అని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే, ఓటింగ్‌ను పూర్తిగా పునరుద్ధరించడంలో దేశ ఎన్నికల సంఘం పాత్ర పోషించాల్సి ఉందని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నుంచి మాకు ఎటువంటి అంచనాలు లేవు.. అయితే, జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తిగా పునరుద్ధరించడంలో అది పాత్ర పోషించాలి.. జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పటికి 10 ఏళ్లు పూర్తయ్యాయి.. రాష్ట్రంలో లోక్‌సభతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు.

Read Also: Samantha: నన్ను మర్చిపోతారేమో అనే భయం ఎప్పుడూ ఉంటుంది..

కాగా, దేశ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’కు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.. దీనిని జమ్మూకశ్మీర్‌ నుంచి ప్రారంభించడం ఉత్తమమని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఇదొక సువర్ణావకాశమన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే తేదీలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను సరైన సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని చెప్పారు. కాశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతున్నట్లు ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.