Leading News Portal in Telugu

Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19 నుంచి లోక్ సభ ఎన్నికలు మొదలు.. 7 విడతలుగా ఎలక్షన్స్..



Elections

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం అవుతున్నాయి. 7 దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
*ఏప్రిల్‌ 19 -తొలి దశ ఎన్నికలు
*ఏప్రిల్ 26- రెండో దశ పోలింగ్.. రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్
*మే 7న మూడో దశ పోలింగ్
*మే 13న నాల్గో దశ పోలింగ్- ఈ రోజనే ఏపీ, తెలంగాణ పోలింగ్.. ఏపీ, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్
*మే 20న ఐదో దశ పోలింగ్
*మే 25న ఆరోదశ పోలింగ్
*జూన్‌ 1న ఏడో దశ పోలింగ్