Leading News Portal in Telugu

PM Modi: పెద్ద పండగ వచ్చింది.. బీజేపీ-ఎన్డీయే పూర్తిగా సిద్ధం..



Pm Modi

PM Modi: లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే బీజేపీ-ఎన్డీయే పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికలు ఏప్రిల్ 19న మొదలై జూన్ 1తో ముగుస్తాయి, జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండగ వచ్చేంది. ఈసీ 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మేము, బీజేపీ-ఏన్డీయే ఎన్నికలకు పూర్తిగా సిద్ధమయ్యాము. మా ట్రాక్ రికార్డ్ ఆధారంగా మేము ప్రజల వద్దకు వెళ్తాము. అన్ని రంగాల్లో మేము సుపరిపాలన అందించాము’’ అని ఆయన అన్నారు.

Read Also: Election Commission: జమ్మూ కాశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన

పదేళ్ల క్రితం ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు భారత్‌లోని ప్రజలు ఇండి కూటమి దయనీయ పాలనకు బలయ్యారు, ప్రజలు ద్రోహం, భ్రమలకు లోనయ్యారని, అన్ని రంగాల్లో అవినీతి చోటు జరిగిందని, ఒక్క రంగాన్ని కూడా వదిలిపెట్టలేదని ఆయన ప్రతిపక్షాలపై ఆరోపించారు. ప్రతిపక్షాలు చుక్కాని లేని విధంగా ఉన్నాయని, వారు చేయగలిగిందల్లా మమ్మల్ని తిట్టడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే అని ఆరోపించారు. వారి కుటుంబ రాజకీయాలు, సమాజాన్ని విభజించే వైఖరిని అంగీకరించడం లేదని, ప్రజలు ఇలాంటి నాయకత్వాన్ని కోరుకోరని ప్రధాని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి 543 స్థానాలకు గానూ ఈ సారి 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. మా మూడో టర్మ్‌లో చేయాల్సిన పని చాలా ఉందని, గత 70 ఏళ్లు పాలించిన వారి ద్వారా ఏర్పడిన ఖాళీని ఈ 10 ఏళ్లలో భర్తీ చేశామని అన్నారు. రాబోయే ఐదేళ్లు వెయ్యేళ్ల దేశ సర్వతోముఖాభివృద్ధికి, ప్రపంచ నాయకత్వానికి బాటలు వేస్తుందని ప్రధాని అన్నారు.