Leading News Portal in Telugu

Bihar Seat-Sharing: ఎన్డీఏలో సీట్లు ఖరారు.. బీజేపీ, జేడీయూకు ఎన్నెన్ని సీట్లంటే..!



Modi

బీహార్‌ ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కూటమిలో ఉన్న బీజేపీ, జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఈ మేరకు సీట్ల పంపకాలు ఖరారైనట్లు జేడీయూ వెల్లడించింది. బీహార్‌లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఒక స్థానం ఎక్కువగా లభించింది. బీజేపీకి 17, జేడీయూకి 16, చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 5 సీట్లు లభించాయి. ఈ సీట్ల ఖరారులో హోంమంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు.

BJP: పోటీ చేసే స్థానాలు ఇవే: పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, ఔరంగాబాద్, మధుబని, అరారియా, దర్భంగా, ముజఫర్‌పూర్, మహారాజ్‌గంజ్, సరన్, ఉజియార్‌పూర్, బెగుసరాయ్, నవాడా, పాట్నా సాహిబ్, పాట్లీపుత్ర, అర్రా, బక్సర్, ససారాం నుంచి బీజేపీ పోటీ చేస్తుంది.
JDU: పోటీ చేస్తున్న స్థానాలు ఇవే: వాల్మీకి నగర్, సీతామర్హి, ఝంజర్‌పూర్, సుపోల్, కిషన్‌గజ్, కతియార్, పూర్నియా, మాధేపురా, గోపాల్‌గంజ్, శివన్, భాగల్పూర్, బంకా, ముంగేర్, నలంద, జహనాబాద్, సియోహర్.
LJP: పోటీ చేస్తున్న స్థానాలు ఇవే: వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి

ఇక ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిలో చేరిన రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) పార్టీలు ఒక్కొక్క స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కరాకర్ నుంచి RLM, గయా నుంచి HAM బరిలోకి దిగుతున్నాయి. ఇలా మొత్తం 40 స్థానాలకు ఎన్డీఏలో సీట్లు సర్దుబాటు పూర్తయింది. ఇక బీహార్‌లో ఇండియా కూటమిలో కూడా సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ 9 స్థానాల్లో, ఆర్జేడీ మిగతా స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత శనివారమే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ఏడు విడతల్లో పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.