
Student Suicide: కర్ణాటకలో 14 ఏళ్ల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన పర్సులోని రూ.2 వేలు దొంగిలించిందని టీచర్ అనుమానించి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పాఠశాలలో జరిగిన సంఘటనల కారణంగానే బాలిక ఈ దారుణానికి ఒడిగట్టిందని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలిక కర్ణాటకలోని బాగల్కోట్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.
Read Also: Adani : అదానీ కంపెనీకి సుప్రీంకోర్టు షాక్.. రూ.50వేల జరిమానా.. షేర్లు క్రాష్
ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు జయశ్రీ, ప్రధానోపాధ్యాయుడు కేహెచ్ ముజావర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డారని బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి తన వాలెట్లోని రూ.2000 దొంగిలించిందని టీచర్ జయశ్రీ అనుమానించింది. అనంతరం ఆ బాలికను అడిగినట్లు తెలిసింది. అందరి ముందు అలా అడగడంతో బాలిక అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. టీచర్ జయశ్రీ లేవనెత్తిన అనుమానాల కారణంగానే ఇలా జరిగినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నేరం రుజువైతే తనను బహిష్కరిస్తానని 8వ తరగతి విద్యార్థినితో టీచర్ అన్నట్లు తెలిసింది. ఆ అమ్మాయి బట్టలు తీసి తనిఖీ చేసినట్లు తెలిసింది. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
Read Also: Wife Burns Husband: ఖమ్మంలో దారుణం.. చెవి దుద్దులు కోసం భర్తకు నిప్పంటించిన భార్య
అంత్యక్రియల తర్వాత బాధితురాలి సోదరి తన తల్లిదండ్రులతో బాధాకరమైన సంఘటనను పంచుకోవడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది.మార్చి 16న బాలిక మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మార్చి 15న తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలిక ఉరివేసుకుని చనిపోయిందని అధికారులు తెలిపారు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది.