
గెలుపే ప్రధానం.. అనే లక్ష్యంతో 13 లోకసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది కాంగ్రెస్. ఓ వైపు సామాజిక సమతుల్యత పాటిస్తూనే.. మరోవైపు విజయం సాదించే ప్రజాబలం కలిగిన వారికే టికెట్లు ఇచ్చే దశలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతుంది. ముఖ్యంగా జనాదరణ ఉన్న నాయకులనే బరిలో దించాలని రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుంది.
Also Read: IPL 2024 SRH: కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్ తో ఆరెంజ్ ఆర్మీ టైటిల్ సాధిస్తుందా..?!
నేటి సాయంత్రం ఢిల్లీ జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రానికి చెందిన లోకసభ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోబోతుంది. ఏఐసీసీ ప్రకటించనున్న నాలుగో జాబితాలో తెలంగాణ లోక్ సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి జాబితాలో ఏఐసీసీ ప్రకటించిన రాష్ట్రానికి చెందిన జహీరాబాద్, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది.
Also Read: Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్‌లో మూగ, చెవిటి బాలుడు నరకయాతన..!
కాకపోతే ఈ రాత్రికి కానీ.. రేపు రాత్రికి కానీ.. మిగితా అభ్యర్థుల వివరాలను అధిష్టానం వెల్లడించే అవకాశముంది. దీనితో తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టి మిగిలిన 13 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.