
Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంగించారని డీఎంకే ఫిర్యాదులో పేర్కొంది. ‘‘ఎంకే స్టాలిన్ పార్టీ దేవాలయాల నుంచి డబ్బును దొంగిలించి హిందూ మతాన్ని నాశనం చేస్తుంది’’ అని ఆమె ఇటీవల ఆరోపించారు. డీఎంకే పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Gaami: పెట్టుబడి పెట్టినవారికి లాభాలతో సహా వెనక్కి ఇచ్చేస్తున్న గామి టీమ్
కేంద్రమంత్రి చేసింది తప్పుడు ప్రకటన అని.. ఎన్నికలకు సంబంధించి ఒక నిర్దిష్ట మతానికి చెందిన మతపరమైన భావాలను ప్రేరేపించే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని డీఎంకే ఫిర్యాదు చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత బీజేపీ సీనియర్ నేత ఈ ప్రసంగం చేశారని పార్టీ ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలనే ఆశతో, మా పార్టీ, మా నాయకుడి ప్రతిష్టను తగ్గించడానికి ద్వేషపూరిత, పరువు నష్టం కలిగించే ప్రసంగాలను చేస్తున్నారని డీఎంకే ఆరోపించింది.
‘‘తాము ఎప్పుడూ దేవాలయాలకు, ఏ మతానికి వ్యతిరేకంగా పనిచేయలేదని, వాస్తవానికి మా ప్రభుత్వం వేల కోట్ల విలువైన దేవాలయాలకు చెందిన భూములను అక్రమ ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నామని, మా పార్టీ ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని మతాల అభివృద్ధికి సహకారం చేస్తోంది’’ డీఎంకే చెప్పింది.