
Building Collapse: ఢిల్లీలోని కబీర్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం ఇవాళ (గురువారం) తెల్లవారు జామున 2. 30 గంటల సమయంలో కుప్పకూలి పోయింది. భవనం కూలిన టైంలో అందులో కార్మికులు పనులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో సహాయక చర్యలు కొనసాగించారు. గాయపడిన వారిని స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించగా.. అయితే, అర్షద్, తౌహీద్ లు చికిత్స పొందుతూ మరణించారు. రెహాన్, అరుణ్, నిర్మల్, జలధర్ లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
Read Also: Amala Paul: తల్లి కాబోతున్న అమలా పాల్.. ‘టూ హ్యాపీ కిడ్స్’ అంటూ..!
ఇక, భవనం కూలిన టైంలో అందులో 13 మంది కార్మికులు పని చేస్తున్నారని డీసీపీ రాజేష్ డియో చెప్పారు. భవన నిర్మాణంకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి అనుప్ మాట్లాడుతూ.. సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వచ్చినట్లు పేర్కొన్నారు. వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.. భవనం శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను బయటకు తీసినట్లు పేర్కొన్నారు. గాయపడిన వారికి చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు.
#WATCH | Delhi: At around 2:16 am, a call was received regarding the collapse of a two-storey, old construction building in Kabir Nagar, Welcome. Two workers Arshad (30) and Tauhid (20) were declared dead at GTB Hospital while another worker Rehan (22) is critical and is being… pic.twitter.com/2Zjw6WmgMo
— ANI (@ANI) March 21, 2024